Monday, May 20, 2024

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్ప వ్యక్తి కేసీఆర్

spot_img

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్‎లోని న్యూఅంబేద్కర్ భవన్‎లో నిర్వహించిన సాగు నీటి దినోత్సవంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ‘కేసీఆర్ అంటే కాల్వలు ,చెక్ డ్యామ్‎లు, రిజర్వాయర్లు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపకోవవటం సంతోషం. కాంగ్రెస్ హయాంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఇక్కడి వ్యక్తి పనిచేశారు, కానీ అప్పుడు వచ్చిన నిధులు ఎన్ని, ఇప్పుడు ఎన్ని నిధులు వస్తున్నాయో ప్రజలు ఆలోచించాలి. కాలువలు తవ్వి వేలకోట్లు దోచుకున్న చరిత కాంగ్రెస్‎ది. కానీ కేసీఆర్ మాత్రం నీటి పారుదల కోసం జిల్లాకు 5000 కోట్లు కేటాయించారు. కేసీఆర్ హయాంలో పారదర్శకత పాలన ఉంది కాబట్టే 21 రోజుల పాటు ప్రతి శాఖలో సాధించిన ప్రగతిని వివరిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాగునీటి పరిస్థితులు చూసి కేసీఆర్ ఎంత బాధపడేవారో ఒక బిడ్డగా నాకు తెలుసు. తెలంగాణ రైతుల పట్ల కేసీఆర్‎కు ఉన్న ప్రేమ తల్లి ప్రేమ వంటిది. ఆయనను కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు.. కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అనాలి. నిజామాబాద్ జిల్లా కాళేశ్వరంతో ఎక్కువ లబ్ధిపొందుతున్నది. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకుతున్నాయంటే దాని వెనుక కేసీఆర్ శ్రమ ఎంతో ఉంది. కాళేశ్వరం నిర్మాణం అంటే అది భగీరథ ప్రయత్నం. కాళేశ్వరం ద్వారా లక్షా 80 వేల ఎకరాలు సాగులోకి తెచ్చుకున్నాం. కాళేశ్వరం గురించి కేంద్రం గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ఇలాంటి గొప్ప ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వక పోవటం సిగ్గు చేటు. ఇప్పటికైనా హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఇంజనీరింగ్‎లో ఉద్యోగాల సంఖ్య తక్కువ ఉండేది, కానీ తెలంగాణ వచ్చాక ఇంజనీర్‎ల సంఖ్యను పెంచుకున్నాం. ఇరిగేషన్, ఇంజనీరింగ్ విభాగాలను పటిష్ట పరుచుకున్నాం, కాబట్టే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 15 శాతం భూగర్భ జలాలు పెరిగాయి. అవసరం ఉన్న చోట దక్షత పాటించే గొప్ప వ్యక్తి కేసీఆర్. కల గన్న తెలంగాణ ఈ రోజు మిల మిల మెరుస్తుంటే చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ పరిపాలన కొనసాగిస్తుంది’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల కోసం కాదు.. భావితరాల భవిష్యత్ కోసం పనిచేస్తుంది
రాష్ట్రం కోసం కలగని, సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న గొప్ప నేత కేసీఆర్ అని ఎమ్మేల్యే గణేష్ గుప్తా అన్నారు. వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గోదావరి నీళ్లను రివర్స్ తెప్పించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలో గొప్ప పేరు తెచ్చుకుందన్నారు. చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం నీటితో వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండగ చేశారన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సాగు నీరు పుష్కలంగా లభిస్తుండటంతో లక్షలాది ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా పేరు తెచ్చుకుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల కోసం కాదు.. భావితరాల భవిష్యత్ కోసం పనిచేస్తుందని ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నారు.

Latest News

More Articles