Friday, May 17, 2024

కాంగ్రెస్ పార్టీ పట్టించుకోపోయినా పీవీని సీఎం కేసీఆర్ గౌరవించారు

spot_img

దేశంలో అనేక సంస్కరణలు తెచ్చిన గొప్ప ప్రధాని పీవీ నరసింహారావు అని అన్నారు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్. పీవీ నరసింహారావు తన ఆలోచన విధానంతో దేశానికి మార్గాన్ని చూపారన్నారు. మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహా రావు 102 వ జయంతి సందర్భంగా  అసెంబ్లీలోని ఆయన నిలువెత్తు చిత్రపటానికి పలువురు ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు .ఈ సందర్భంగా పీవీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆ తర్వాత మాట్లాడిన బండా ప్రకాశ్..ఆయన  చూపిన ఆర్థిక సంస్కరణలు ఇప్పటికి దేశంలో అమలు అవుతున్నాయన్నారు.

దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన ఘనత పీవీదే నని అన్నారు అసెంబ్లీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. ఆనాడు ఆర్థిక కష్టాలు, కాంగ్రెస్ పార్టీ కష్టాలను తీర్చిన గొప్ప నాయకులన్నారు.పార్టీని కష్టాల నుంచి గట్టెక్కించినా ..పీవీకి తగిన గౌరవం కాంగ్రెస్ ఇవ్వలేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ పట్టించుకోపోయినా సీఎం కేసీఆర్ గౌరవించారని చెప్పారు..పీవీ కూతురు ,ఎమ్మెల్సీ వాణి దేవి. పీవీ నరసింహారావు జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించి తగిన గౌరవం ఇచ్చిందన్నారు. పీవీ నరసింహారావు అంటే ఒక అద్భుతంమన్నారు. ఆయన. పనే దైవం అని నమ్మిన వ్యక్తి అని అన్నారు.పీవీ నరసింహారావు 35ఏళ్ళ క్రితం ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల అభివృద్ధి ఫలాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నామని చెప్పారు ఎమ్మెల్సీ వాణి దేవి.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు కాంగ్రెస్ పార్టీ నుంచి తగిన గౌరవం లభించలేదని తెలిపారు ఎమ్మెల్సీ ఎల్..రమణ. పీవీ నరసింహారావు ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకున్నా కేసీఆర్ గౌరవించారని అన్నారు.ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహిస్తోంది..పీవీ విగ్రహాన్ని పెట్టి సీఎం కేసీఆర్.. పీవీ గురించి భవిష్యత్ తరాలకు ఆయన గురించి తెలియజేశారని తెలిపారు.

Latest News

More Articles