Sunday, May 19, 2024

ఆస్ట్రియా ప్రధానిని కరిచిన మరో దేశాధ్యక్షురాలి పెంపుడు శునకం

spot_img

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పెంపుడు శునకం ‘కమాండర్‌’ ఇటీవలే వైట్‌హౌస్‌లో భద్రతా సిబ్బందిని తరచూ కరిచి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. సుమారు పది సార్లకు పైగా సిబ్బందిని కరవడంతో ఆ శునకాన్ని శ్వేతసౌధం నుంచి తరలించారు. అయితే, తాజాగా యూరప్‌లోని మాల్డోవా అధ్యక్షురాలు మైయా సందు పెంపుడు శునకం ఏకంగా ఆస్ట్రియా ప్రధానినే కరిచింది.

Read Also: ఒకటికి రెండు.. రెండుకి నాలుగు.. ఏటీఎంలో 1000కి 2000 వస్తున్నయ్..

ఆస్ట్రియా ప్రధాని అలెగ్జాండర్‌ వాన్‌ డెర్‌ బెలెన్.. ప్రస్తుతం మాల్డోవాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మాల్డోవా అధ్యక్షురాలితో భేటీ అయ్యారు. అనంతరం ఇరుదేశాల అధినేతలు కలిసి అధ్యక్ష నివాస ప్రాంగణంలో సరదాగా సంభాషించారు. ఈ క్రమంలో అధ్యక్షురాలి శునకాన్ని ఆస్ట్రియా ప్రధాని దగ్గరకు తీసుకునే క్రమంలో అది కరిచినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా, తన పెంపుడు శునకం కరవడంపై మాల్డోవా అధ్యక్షురాలు మైయా.. ఆస్ట్రియా ప్రధానికి క్షమాపణలు చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఆస్ట్రియా ప్రధాని సైతం ఇన్‌స్టా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఓ పోస్ట్‌ పెట్టారు. తనకు పెంపుడు కుక్కలంటే ఎంతో ప్రేమని.. దాన్ని దగ్గరికి తీసుకున్నప్పుడు ఉత్సాహంతో ఆ శునకం అలా చేసి ఉండొచ్చని చెప్పుకొచ్చారు.

Latest News

More Articles