Friday, May 3, 2024

చిరుతను తరిమికొట్టిన కోతులు.. వీడియో వైరల్..

spot_img

చిరుతను ఎవరైనా వెనకడుగు వేస్తారు. కానీ, ఓ కోతుల గుంపు మాత్రం అడుగు ముందుకేసి, చిరుతను ఉరికించాయి. ఈ ఘటన సౌతాఫ్రికాలో జరిగింది. రోడ్డు మీద కోతులు గుంపుగా వెళ్తున్నాయి. ఎక్కడి నుంచో నక్కినక్కి వస్తున్న చిరుత.. ఓ కోతి మీద దాడిచేసింది. వెంటనే తేరుకున్న మిగతా కోతులు ఒక్కసారిగా చిరుత మీద పడ్డాయి. అన్నీ కలిసి ఒకేసారి దాడి చేశాయి. ఏం చేయాలో తెలియని చిరుత.. వాటినుంచి తప్పించుకొని అడవిలోకి పారిపోయింది. లేటెస్ట్ సైటింగ్స్‌ అనే యూట్యూబ్ ఛాన‌ల్ పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

Latest News

More Articles