Sunday, May 19, 2024

తుపాకీతో ఇంట్లోకి చొరబడిన అగంతకులు: చుక్కలు చూపించిన తల్లీకూతుళ్లు

spot_img

ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక దగ్గర దొంగతనాలు, దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చైన్ స్నాచింగ్లు కూడా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు దొంగలు కూడా తెవిలిమీరి పోతున్నారు. ఎవరూ లేని సమయంలో ఇళ్లల్లోకి దూరి ఆయుధాలతో బెదిరింపులకు దిగుతున్నారు. కొందరు భయపడితో ప్రాణభయంతో డబ్బు, నగలు ఇచ్చేస్తుంటే.. ఇలాంటి ఆడవాళ్లు మాత్రం ఎదురుతిరిగి దుండగులను తరిమి తరిమి కొడుతున్నారు.

హైదరాబాద్ బేగంపేటలో ఇద్దరు దుండగులు ఒక తుపాకీ తీసుకుని ఓ ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ ఇంట్లో కేవలం ఆడవాళ్లు మాత్రమే ఉన్నారని తెలుసుకున్నట్లు ఉన్నారు. అందుకే ఆ ఇంటిని టార్గెట్ చేసుకుని దోపిడీకి పథకం రచించారు. అనుకున్నదే తడవుగా ఇద్దరు అగంతకులు గేటు తీసుకుని కారిడార్ లోగా మెయిన్ డోర్ దగ్గరకి వచ్చారు. మెయిన్ డోర్ దగ్గర ఏదో చెప్తున్నట్లుగా నటించి ఒక పాత నాటు తుపాకీ బయటకు తీసి ఇద్దరూ ఇంట్లోకి వెళ్లారు. అయితే ఆ ఇంట్లో మహిళ గన్ పట్టుకున్న వాడిని బయటకు లాక్కొంచింది. అతనితో గట్టిగానే పోరాడింది. గన్ పట్టుకున్న అతని చేతిని వదల్లేదు. ఆమెకు కుమార్తె కూడా తోడు వచ్చింది. ధైర్యంగా అగంతుకలతో కుమార్తె కూడా పోరాడింది. ఆ తల్లి అతని దగ్గరి నుంచి గన్ లాక్కుంది. అతనికే ఎక్కు పెట్టింది. ఎక్కడ ఆమె గన్ తో కాలుస్తుందో అని వాడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిజానికి కాసేపు ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆ మహిళ ఎక్కడా తగ్గకుండా అతనికి తగిన బుద్ధి చెప్పింది.

రెండో వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు రాలేదు. అతను భయంతో ఇంట్లోనే ఉండిపోయాడు. అయితే అప్పటికే రోడ్డు మీద ఉన్న కొందరు లోపలికి వచ్చారు. రెండో వ్యక్తిని ఆ మహిళ బయటకు లాక్కొచ్చింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ ఇద్దరు అగంతకులు పరారయ్యారు. అయితే ఈ మొత్తం వ్యవహారం అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. కేస్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు, ఆ తల్లీకూతుళ్ల ధైర్యసాహసాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే.. పోలీసుల అదుపులో ఓ నిందితుడు ఉన్నట్లు తెలిసింది. నిందితులు తెలిసిన వారా? లేక బయట నుంచి వచ్చిన దొంగలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడిన దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్న త‌ల్లికుమార్తెల పోరాట పటిమ అభినందనీయమ‌ని అన్నారు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని. వారి ఇంటికి వెళ్లిన డీసీపీ త‌ల్లి కుమార్తెలను స‌త్క‌రించారు. దొంగలను పట్టుకునేందుకు అమిత్ మహోత్, ఆమె మైనర్ కూతురు చేసిన కృషి ఇత‌రుల‌కు స్ఫూర్తినిచ్చేదిగా ఉంద‌ని అన్నారు. పదకొండేళ్ల సర్వీసులో ఇంత ధైర్యం చూపిన మహిళలను చూడలేద‌న్నారు డీసీపీ.

ఇది కూడా చదవండి: తెలియని పెళ్లికి వెళ్లి భోజనం చేస్తే ఈ సెక్షన్ తో ఇక పై జైలుకే!

Latest News

More Articles