Monday, May 20, 2024

వంకలు పెట్టి మహిళా బిల్లును ముంచొద్దు..!

spot_img

మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టిన తరువాత లోక్ సభలో ఎంపీ మాలోత్ కవిత ప్రసంగించారు. మహిళ రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. ‘మహిళా బిల్లుపై మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నా. మహిళా బిల్లు పెట్డడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్న. అయితే బిల్లు అమలు తీరుపై మహిళల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ వచ్చిన కొత్తలోనే మహిళా బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేశారు.

దేశానికి ఆదర్శంగా ఉండేలా సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషనలను అమలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలును కాలయాపన చేయొద్దు. కాలయాపన చేస్తే కేంద్రం ఎన్నికల ఎత్తుగడ కోసం బిల్లును తీసుకువచ్చినట్లుగా భావించాల్సి వస్తోంది. ఎక్కడ బిల్లుకి అన్యాయం జరగొద్దు. 2024ల్లోనే అమలు అయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారమే ఈ బిల్లును అమలు చేయాలి. డిలీమిటేషన్ పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలును ఆపొద్దు’ అని ఎంపీ మాలోత్ కవిత పేర్కొన్నారు.

Latest News

More Articles