Saturday, May 18, 2024

ఫోన్ ఎక్కువగా వాడితే అవన్నీ కట్.. బాండ్ పేపర్ మీద సంతకాలు తీసుకున్న ఓ తల్లి

spot_img

ప్రస్తుత కాలంలో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్ ఉపయోగించి తమ పనులు సులువు చేసుకోమంటే.. చాలా మంది మాత్రం ఆ స్మార్ట్ ఫోన్‎కు బానిసలవుతున్నారు. పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునేటప్పుడు కూడా ఫోన్‎ను వదలడంలేదు. చివరికి ఎలా మారారంటే.. ఫోన్ చూస్తూచూస్తూనే నిద్రలోకి జారుకుంటున్నారు. ఇలాంటి వ్యసనాలు తమ కుటుంబసభ్యులకు రాకూడదని ఓ మహిళ మంచి నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ ఎక్కువగా ఫోన్ వాడకూడదని రూల్ పెట్టింది. అందుకోసం ఏకంగా బాండ్ పేపర్ రాయించింది. ఈ ఘటన ముంబైలో వెలుగుచూసింది.

Read Also: ఒక్క నెలలోనే రేవంత్‌ ప్రభుత్వం ఆపేసిన సంక్షేమ పథకాలెన్నో తెలుసా?

ఇంట్లో అందరూ మొబైల్‌ ఫోన్‌లో గంటలు గంటలు గడిపేస్తున్నారని ముంబైకి చెందిన మంజుగుప్తా అనే మహిళ గుర్తించింది. ఇంట్లో అందరూ ఒకే చోట ఉన్నా.. ఒకరితో మరొకరు మాట్లాడుకోకుండా ఫోన్లలో తల పెట్టుకుని కూర్చొంటున్న సమస్యకు పరిష్కారం చూపాలనుకొన్నది. ఈ మేరకు కుటుంబసభ్యులతో ఒప్పందం చేసుకొని బాండ్‌ రాయించుకొన్నది. ఇంట్లో ఫోన్‌ అధిక వాడకంపై షరతులు విధించింది. ఈ మేరకు 50 రూపాయల బాండ్‌పేపర్‌పై కొన్ని షరతులు టైప్‌ చేయించి వారితో సంతకాలు చేయించింది.

బాండ్‌ పేపర్‌లో ఏముందంటే..

  • అందరూ నిద్ర లేవగానే మొబైల్‌ చూడకుండా నేరుగా సూర్య దర్శనానికి వెళ్లాలి.
  • అందరూ కలిసి డైనింగ్‌ టేబుల్‌ వద్ద భోజనం చేయాలి.
  • అన్నం తినేటప్పుడు ఫోన్‌లను తప్పనిసరిగా దూరంగా ఉంచాలి.
  • వాష్‌రూమ్‌కు వెళ్లేటప్పుడు ఎవరూ ఫోన్‌ను వెంట తీసుకెళ్లకూడదు.
  • ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే.. శిక్షగా ఆ సభ్యునికి జొమాటో, స్విగ్గీ యాక్సెస్‌ తీసివేయబడుతుంది.

Latest News

More Articles