Friday, May 17, 2024

వికీపీడియా విరాళాలపై మస్క్ సెటైర్లు

spot_img

ఇంటర్నెట్ లో వికీపీడియా గురించి తెలియని వారుండరు. ఏ అంశం గురించి అయినా ఉచితంగా సమాచారం పొందడానికి వెంటనే వికీపీడియా ఓపెన్ చేస్తారు నెటిజన్లు.అయితే, కొద్ది కాలంగా వికీపీడియాను ఓపెన్‌ చేయగానే విరాళాలకు సంబంధించిన మెసేజ్ కనిపిస్తుంది.  దీనిపై ఎలాన్‌ మస్క్‌ సెటైరికల్ కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

Also Read.. భారత్ vs న్యూజిలాండ్: ‘స్టార్మ్‌ఛేజర్’ విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ చీర్స్ 

‘వికీపీడియా పేరును (రాయటానికి వీలులేని ఓ బూతు పేరుగా) మారిస్తే .. వారికి నేను బిలియన్‌ డాలర్లు ఇస్తాను. అసలు వికీపీడియా ఎందుకు డబ్బులు అడుగుతోంది. వికీ నిర్వహణకు అంతడబ్బు అవసరం లేదు. మరి దేనికోసం ఆ సొమ్ము అడుగుతున్నారు? ’ అని మస్క్ ట్వీట్ చేశారు. ఈసందర్భంగా గురకపెడుతున్న ఎమోజీని షేర్ చేశారు. ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Latest News

More Articles