Sunday, June 16, 2024

నిర్మల్‌ జిల్లాలో ముస్కాన్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా..20 మందికి గాయాలు.!

spot_img

నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్కాన్ ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సు బోల్తాపడింది. సారంగాపూర్ మండలంలోని రాణాపూర్ గ్రామం వద్ద బుధవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయలయ్యాయి. గాయపడిన వారిని నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ఉన్నారు. బస్సు బోల్తాపడిన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది.

అటు కర్నూలు జిల్లాలోనూ ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారు. ఈ ఘటన కోడుమూరు, ప్యాలకుర్తి మధ్య జరిగింది. డ్రైవర్ అతివేగంతో మరో వాహనాన్ని ఓవర్ టెక్ చేసే క్రమంలో బస్సు బోల్తాపడిందని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఇద్దరుచిన్నారులు మరణించారు. వారి వయస్సు 10ఏండ్లలోపే ఉంది. మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కొడుమూరు, కర్నూలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి : క్లాస్ లోనే తోటి విద్యార్థినిపై అత్యాచారం..ఆపై వీడియో తీసి ..!

Latest News

More Articles