Saturday, May 18, 2024

విశ్వక్‌సేన్‌కు బాలకృష్ణ సర్‌ప్రైజ్‌..!!

spot_img

హైదరాబాద్‌: యాక్టర్ విశ్వక్‌సేన్‌ కు టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. విశ్వక్‌ తాజాగా నటిస్తోన్న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సెట్స్‌ను బాలయ్యబాబు సందర్శించి అందరికి షాకిచ్చారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను విశ్వక్‌ తన ఇన్‌స్టాలో షేర్‌ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చూడండి : మాళవిక ఓనం సెలబ్రేషన్స్

‘‘ గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి సెట్స్‌లో బాలకృష్ణ గారు నాకు అద్భుతమైన సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ధన్యవాదాలు సర్‌. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. లుక్‌ రివీల్‌ కాకూడదనే కారణంతో నా ఫుల్‌ పిక్చర్స్‌ను పోస్ట్‌ చేయలేకపోతున్నా. సినిమా విడుదలయ్యాక తప్పకుండా ఫొటోలు, వీడియోలను అందరితో పంచుకుంటా.’’ అని విశ్వక్ తన పోస్టులో రాసుకొచ్చారు.

ఇది కూడా చూడండి : దివి అందాల కనువిందు

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’లో విశ్వక్‌ సేన్‌ – నేహాశెట్టి జంటగా నటిస్తున్నారు.  మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం ‘భగవంత్‌ కేసరి’ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో జరిగాయి. ఈ క్రమంలోనే విశ్వక్‌సేన్‌ సెట్స్‌కు వచ్చి బాలకృష్ణ సందడి చేశారు.

Latest News

More Articles