Monday, May 20, 2024

నూతన మెట్రో రైల్ రూట్ మ్యాప్ సిద్ధం.. కొత్త రూట్లు ఇవే!

spot_img

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో నూతన మెట్రో రైల్ రూట్ మ్యాప్ ను హెచ్ఏమ్ఆర్ఎల్ సిద్ధం చేసింది. ఫేస్ 2లోని జూబ్లీబస్ స్టాండ్, సికింద్రాబాద్ నుండి ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రోని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఫేస్ 2లో 70 కిలోమీటర్లు మెట్రో మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు. మూడు నెలల్లో దీనికి సంబంధించిన డీపీఆర్ సిద్దం చేస్తామని మెట్రో ఎండీ ఎన్విఎస్ రెడ్డి తెలిపారు.

నూతన మెట్రో కారిడార్ రూట్లు

  • కారిడార్ 2లో ఎంజీబీఎస్ నుండి ఫలక్ నుమా వరకు 5.5 కిలోమీటర్లు
  • కారిడార్ 2లో ఫలక్ నుమా నుండి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కి.మీ.
  • కారిడార్ 4లో నాగోల్ మెట్రో స్టేషన్ నుండి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ మరియు చాంద్రాయణగుట్ట మీదుగా మైలార్ దేవ్ పల్లి పి7 రోడ్డు నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 29 కిలోమీటర్లు.
  • కారిడార్ 4లో మైలార్ దేవ్ పల్లి నుండి వయా ఆరాంఘర్ మీదుగా ప్రపోస్డ్ హైకోర్టు రాజేంద్రనగర్ వరకు 4 కి.మీ.
  • కారిడార్ 5లో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి బయోడైవర్సిటీ జంక్షన్ నానక్రాం గూడ జంక్షన్ విప్రో జంక్షన్ మరియు అమెరికన్ కౌన్సిలేట్ వరకు ఎనిమిది కిలోమీటర్లు.
  • కారిడార్ 6లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి బిహెచ్ఎల్ మీదుగా పటాన్ చెరు వరకు 14 కిలోమీటర్లు.
  • కారిడార్ 7లో ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుండి వనస్థలిపురం మీదుగా హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్లు.

 

Latest News

More Articles