Saturday, May 11, 2024

బీజేపీ మహిళా వ్యతిరేకి.. సీతాదేవి గురించి ఎందుకు మాట్లడరు?

spot_img

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ మహిళా వ్యతిరేకి అని విమర్శించారు. వారు రాముడి గురించి మాత్రమే మాట్లాడతారని, సీతా మాతాను ఎందుకు గుర్తుచేయరని ప్రశ్నించారు. కోల్‌కతాలో జరిగిన సర్వమత సామరస్య ర్యాలీని మమతా బెనర్జీ నిర్వహించారు.  కాళీఘాట్‌లోని కాళీమాత ఆలయంలో పూజ తర్వాత ఈ ర్యాలీ ప్రారంభమైంది. మార్గమధ్యలో ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలను మమతా సందర్శించారు.

Also Read.. ఓటుకు నోటు ఎమ్మెల్సీ అభ్యర్థికి కేబినెట్ ర్యాంక్ ఏంటీ ?

ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ… రాముడి గురించే బీజేపీ వాళ్లు మాట్లాడతారని, మరి సీతా దేవి సంగతి ఏమిటి? అని నిలదీశారు. రాముడి వనవాస సమయంలో ఆయన వెంట సీతాదేవి ఉన్నది కదా. బీజేపీ మహిళా వ్యతిరేకులు కాబట్టే సీత గురించి మాట్లాడరని విమర్శించారు.  అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠాపన కార్యక్రమం బీజేపీ రాజకీయ జిమ్మిక్కు అని మమతా బెనర్జీ కొట్టిపారేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మతాన్ని రాజకీయం చేస్తున్నారని ఆమె విమర్శించారు.

Latest News

More Articles