Saturday, May 18, 2024

ఓటుకు నోటు ఎమ్మెల్సీ అభ్యర్థికి కేబినెట్ ర్యాంక్ ఏంటీ ?

spot_img

తెలంగాణలో ఓటుకు నోటు కేసు ఒక సంచలనమే. అప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్న చంద్రబాబు అండ్ కో పన్నాగాలను పసిగట్టి రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది తెలంగాణ పోలీస్. డబ్బుల కట్టలతో అడ్డంగా దొరికిపోయాడు రేవంత్ రెడ్డి. అయితే చంద్రబాబు అండతో కాంగ్రెస్ లో చేరటం.. కాలం కలిసొచ్చి సీఎం కూడా అయిపోయాడు రేవంత్ రెడ్డి. అయితే అదే కేసులో రేవంత్ సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నట్టు వార్తలొచ్చాయి.

ఇప్పుడు ముఖ్యమంత్రి వ్యవహారాల సలహాదారుగా నియమితులయ్యారు. గతంలో రేవంత్ టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరిన సమయంలో నరేందర్ ఆయనవెంట నడిచారు. ఇక రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన వ్యవహారాలన్నీ వెనకుండి పర్యవేక్షించింది నరేందర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలా చాలాకాలంగా తనవెంటే నడుస్తున్న నరేందర్ రెడ్డికి సీఎం రేవంత్ తన సలహాదారుగా నియమించుకున్నారు.

Latest News

More Articles