Friday, May 17, 2024

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్‌ మాజీ ప్రధాని

spot_img

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ మాజీ ప్రధాని జెసిండా ఆర్డర్న్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన చిరకాల భాగస్వామి క్లార్క్ గేఫోర్డ్‌ను వివాహం చేసుకున్నారు. వాస్తవానికి, ఇద్దరికి 2019 మేలోనే నిశ్చితార్థం అయ్యింది. 2022 మొదట్లో పెళ్లి చేసుకుందామనుకున్నా.. కొవిడ్‌ నిబంధనల కారణంగా కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.

Also Read.. గృహలక్ష్మి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు

తాజాగా కొద్దిమంది అతిథుల సమక్షంలో జరిగిన వారి వివాహానికి న్యూజిలాండ్‌ ప్రధాని క్రిస్‌ హిప్‌కిన్స్‌, ఇతర నేతలూ హాజరైనట్లు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. గేఫోర్డ్‌ టీవీ ప్రజెంటేటర్‌గా పనిచేస్తున్నారు.

Also Read.. చంద్రబాబును కలిసిన వైఎస్ షర్మిల

2017లో 37 ఏళ్ల వయసులో న్యూజిలాండ్‌ ప్రధానిగా జెసిండా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. ప్రపంచంలో పిన్న వయస్కురాలైన ప్రభుత్వాధినేతగా అప్పట్లో ఆమె రికార్డు సృష్టించారు. 2018లో ప్రధానిగా ఉన్న సమయంలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చారు. 2020లో జెసిండా రెండోసారి ప్రధాని అయ్యారు. గతేడాది జనవరిలో ప్రధాని పదవీకి రాజీనామా ప్రకటించి.. అనుహ్యంగా రాజకీయాల నుంచి వైదొలిగారు.

Latest News

More Articles