Sunday, May 19, 2024

న్యూఢిల్లీలో హై అలర్ట్‌

spot_img

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో అధికారులు న్యూఢిల్లీలో హై అలర్ట్ ను ప్రకటించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన ఆందోళనలు చెలరేగనున్నాయనే ముందస్తు సమాచారంతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు ఢిల్లీలో హై అలర్ట్ ను ప్రకటించారు. ముఖ్యంగా ఇవాళ(శుక్రవారం) ప్రార్థనల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం, యూదుల సంస్థల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఇప్పటికే కేంద్రం ఆపరేషన్‌ అజయ్ ను ప్రారంభించింది. మొదటి విమానంలో 212 మంది భారతీయులు ఇజ్రాయెల్‌ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.

దేశంలో నివసిస్తున్న ఇజ్రాయెల్ ల భద్రతను కాపాడాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌ పర్యాటకులకు, దౌత్యవేత్తలు సహా సిబ్బందికి భద్రత పెంచాలని కోరింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ సహా పలు దేశాలు ఇప్పటికే యూదుల భద్రతకు హామీ ఇస్తూ సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. భారత్‌ కూడా దీనికి సంబంధించి చర్యలు చేపట్టింది.

ఇది కూడా చదవండి: వంద‌ల కోట్ల పంపిణీ.. ముఠా నాయ‌కుడు రేవంత్ రెడ్డే!!

Latest News

More Articles