Friday, May 17, 2024

వన్ ప్లస్ 12 సీరిస్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్..పూర్తి వివరాలివే.!

spot_img

కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకో బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ అయిన వన్ ప్లస్ 12 సిరీస్ కొనుగోలు పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ విడుదలైన చేసిన నెలలోపే ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సిరీస్ లోని వన్ ప్లస్ 12, వన్ ప్లస్ 12ఆర్ రెండు స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై ఈ ఆఫర్ పొందవచ్చు. . ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ సిరీస్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల కొనుగోలుపై మంచి తగ్గింపు ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. వన్ ప్లస్ ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో వన్ ప్లస్ 12, వన్ ప్లస్ 12ఆర్ రెండు ఫోన్‌లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌ల కొనుగోలుపై వినియోగదారులు ఈ తగ్గింపును పొందుతారు.

వన్ ప్లస్ 12, ఈ సిరీస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్, రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ, 16జీబీ ర్యామ్ 512జీబీ ఉండగా.. దీని ప్రారంభ ధర రూ.64,999. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ. 2,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అదే సమయంలో,వన్ ప్లస్ 12ఆర్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో కూడా కొనుగోలు చేయవచ్చు – 8జీబీ ర్యామ్ + 128జీబీ, 16జీబీ ర్యామ్ + 256జీబీ వేరియంట్ అందుబాటులో ఉన్నాయి. ఫోన్ ప్రారంభ ధర రూ.39,999. ఈ ఫోన్ కొనుగోలుపై రూ.1,500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 4500 నిట్స్ సపోర్ట్‌తో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. వన్ ప్లస్ 12 6.8 అంగుళాల 2K ఆల్మోడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే, వన్ ప్లస్ 12R 1.5K ఆల్మోడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ రెండు ఫోన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్ ఫీచర్‌తో వస్తాయి.వన్ ప్లస్ ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 16జీబీ ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజీకి సపోర్టు చేస్తాయి.

వన్ ప్లస్ 12 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. అయితే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 Gen 2 వన్ ప్లస్ 12Rలో అందుబాటులో ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 50మెగాపిక్సెల్ ప్రధాన OIS కెమెరాతో వస్తాయి. ఫోన్ బ్యాక్ సైడ్  ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్‌లు పెద్ద బ్యాటరీలు, 100వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తాయి. ఆండ్రాయిడ్ 14లో పనిచేస్తాయి.

ఇది కూడా చదవండి: నా పేరుతో రాజకీయం చేస్తే చర్యలు తప్పవు..ఏపీ నేతలకు మోహన్ బాబు వార్నింగ్..!!

Latest News

More Articles