Thursday, May 2, 2024

నా పేరుతో రాజకీయం చేస్తే చర్యలు తప్పవు..ఏపీ నేతలకు మోహన్ బాబు వార్నింగ్..!!

spot_img

పక్క రాష్ట్రం ఏపీలో ఎన్నికల హీట్ షురూ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పార్టీ నేతలను తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించేస్తున్నాయి ఆయా పార్టీలు. ఈ నేపథ్యంలో తన పేరు వాడుకుంటున్నావారికి గట్టి షాకిచ్చారు సినీనటుడు మోహన్ బాబు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో లేఖను కూడా విడుదల చేశారు.

లేఖలో మోహన్ బాబు ఏమన్నారంటే ..ఈ మధ్యకాలంలో తన పేరును కొందరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని తన ద్రుష్టికి వెళ్లిందట. దయచేసి ఏ పార్టీ అయినా సరే..నా పేరును వారి వారి స్వప్రయోజనాల వాడుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అబిప్రాయాలు వారికి ఉంటాయి. అది వారి వ్యక్తిగత విషయం. చేతనైతే నలుగురికి సహాయం చేయడంలో మనం ద్రుష్టిపెట్టాలి.

సంబంధంలేని వారిని రాజకీయ పార్టీల్లోకి వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపచేయడంలో అందరం బద్దులై ఉందామని కోరుకుంటున్నాను. ఉల్లంఘించినవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాను. అంటూ మోహన్ బాబు లేఖను విడుదల చేశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది కూడా  చదవండి: ఐడిబిఐ బ్యాంకులో 500జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ల దరఖాస్తుకు నేడే చివరి తేదీ.!

Latest News

More Articles