Sunday, May 19, 2024

జ్ఞాన్‌వాపి నివేదికపై ఒవైసీ ఆగ్రహం..ఏఎస్‌ఐ హిందుత్వ బానిస అంటూ ఫైర్..!

spot_img

వారణాసికి చెందిన జ్ఞాన్‌వాపి మసీదుకు చెందిన ASI ఈ సర్వేలో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ, ప్రస్తుత కట్టడాన్ని నిర్మించడానికి ముందు అక్కడ పెద్ద హిందూ దేవాలయం ఉండేదని ASI చెప్పినట్లు తెలిపారు. ఇది ASI యొక్క నిశ్చయాత్మక ముగింపు అన్నారు. ఏఎస్‌ఐ రిపోర్టు పబ్లిక్‌గా మారినప్పటి నుంచి జ్ఞాన్‌వాపీ వ్యవహారం వేడెక్కింది. ఈ మొత్తం వ్యవహారంపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

నిర్మాణ అవశేషాలు, బహిర్గత లక్షణాలు, కళాఖండాల శాసనాలు, కళ, శిల్పాలను శాస్త్రీయ అధ్యయనం/సర్వే ఆధారంగా అధ్యయనం చేసినట్లు ASI నివేదికలో ఒక భాగం తెలిపింది. ప్రస్తుతం ఉన్న కట్టడాన్ని నిర్మించకముందే అక్కడ హిందూ దేవాలయం ఉండేదని పేర్కొంది. దీనిపై ఒవైసీ స్పందిస్తూ, ఈ నివేదిక ఏ ప్రొఫెషనల్ ఆర్కియాలజిస్టులు లేదా చరిత్రకారుల ముందు అకడమిక్ పరిశీలనకు నిలబడదని అన్నారు. నివేదిక ఊహాగానాలపై ఆధారపడిందని..శాస్త్రీయ అధ్యయనాలను అపహాస్యం చేస్తుందని ఫైర్ అయ్యారు. ASI హిందూత్వ బానిస అంటూ ఆరోపించారు.

సర్వేలో ఏం తేలింది:
హిందూ దేవాలయం స్తంభాలతోనే ప్రస్తుత మసీదు నిర్మించారని పురావస్తు శాఖ అధికారుల సర్వేలో తేలిందని హిందూపక్షం న్యాయవాది చెప్పారు. మసీదు దక్షిణ భాగంలని గోడ, హిందూ ఆలయానికి చెందినదని..అనుమానాలు ఉన్నాయన్నారు. ఆలయానికి సంబంధించిన శిల్పాలను కాస్త చెక్కి మళ్లీ మసీదు నిర్మాణంలో ఉపయోగించారన్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి 34 కీలక శాసనధారాలు లభ్యమైనట్లు చెప్పారు. జనార్థన, రుద్ర, ఉమేశ్వర పేర్లతో ఈ శాసనాలు లభ్యమైనట్లు వెల్లడించారు. ఇవి దేవనాగరి, తెలుగు , కన్నడ భాషల్లో ఉన్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: జ్ఞానవాపి మసీదు కింద హిందూ దేవాలయం అవశేషాలు..!!

Latest News

More Articles