Saturday, May 18, 2024

పాకిస్తాన్ లో భారీ పేలుడు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన నలుగురు దుర్మరణం..!!

spot_img

పాకిస్తాన్ లోని బలూచిస్థాన్ ప్రాంతంలో మంగళవారం జరిగిన బాంబు పేలుడులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన ముగ్గురు సభ్యులతో సహా నలుగురు వ్యక్తులు మరణించారు. ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించిన కొన్ని గంటల తర్వాత పార్టీ నిర్వహించిన ర్యాలీలో పేలుడు సంభవించింది. “తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌కు చెందిన ముగ్గురు మరణించారు. ఏడుగురు గాయపడ్డారని పీటీఐ బలూచిస్తాన్ ప్రావిన్స్ జనరల్ సెక్రటరీ సలార్ ఖాన్ కాకర్ PTI X ఖాతాలో షేర్ చేసిన వీడియో సందేశంలో తెలిపారు.

సాబీలో తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేషనల్ అసెంబ్లీ అభ్యర్థి సద్దాం తరీన్ ర్యాలీలో పేలుడు సంభవించినట్లు చెబుతున్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న నలుగురు మరణించారు. ఈ పేలుడు తర్వాత, ఆలం ఖాన్ కాకర్ ట్వీట్ చేశాడు.పేలుడును తీవ్రంగా ఖండిస్తున్నాను…ప్రజారక్షణలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ విమర్శలు చేశారు.

అయితే, పేలుడులో ఐదుగురు గాయపడ్డారని సిబిలోని జిల్లా ప్రధాన ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బాబర్ పాకిస్తాన్ డాన్ వార్తాపత్రికతో చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వైరల్ అవుతున్న వీడియో:
బలూచిస్తాన్‌లోని సిబి ప్రాంతంలో బాంబు పేలిన క్షణం కెమెరాలో బంధించారు. పెద్ద శబ్దంతో పిటిఐ సభ్యులు పెనుగులాడుతున్నట్లు కనిపిస్తుంది. పార్టీ బలపరిచిన అభ్యర్థి సద్దాం తరీన్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పేలుడు సంభవించిందని పీటీఐ నేత సలార్ ఖాన్ కాకర్ తెలిపారు.ఈ వీడియో వైరల్ గామారింది.

Latest News

More Articles