Saturday, May 18, 2024

పారాసిటమాల్‌ తో కాలేయానికి ప్రమాదం

spot_img

బాడీ పెయిన్స్, తలనొప్పి ఉంటే టాబ్లెట్స్ వేసుకుంటాం. కొందరు డాక్టర్ల దగ్గకు వెళ్తే మరికొందరు మెడికల్ షాపు నిర్వాహకుడిని అడిగి టాబ్లెట్స్ తీసుకుని వాడుతారు. అయితే మనం వేసుకునే టాబ్లెట్ల డోస్ ఎక్కువైతే ప్రాబ్లమ్స్ తప్పవంటున్నారు వైద్య నిపుణులు.

ముఖ్యంగా పారాసిటమాల్ టాబ్లెట్ యూజ్ చేసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆ టాబ్లెట్ డోస్ నాలుగు గ్రాములు మించి ఉండకూడదంటున్నారు. అంతకుమించి అధిక మొత్తంలో ఉన్నా…ఆ డ్రగ్ ను ఎప్పూడూ వాడినా లివర్ దెబ్బతినటం ఖాయమంటున్నారు.

యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ సైంటిస్టుల అధ్యయనంలో కొత్త విషయాలు తెలిశాయి. ఎలుకలపై ప్రయోగాలు జరపగా, వాటి కాలేయం దెబ్బతినటం జరిగిందని సైంటిస్టులు తెలిపారు.

ఇది కూడా చదవండి:లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారు

Latest News

More Articles