Sunday, May 19, 2024

పాకిస్థాన్ లో కుండ‌పోత‌గా వాన..అంధ‌కారంలో క‌రాచీ

spot_img

భారీ వర్షాల కారణంగా పాకిస్థాన్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. కరాచీ సహా పలు నగరాల్లో గ‌త నిన్న(శనివారం) రాత్రి నుంచి కుండ‌పోత‌గా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు కురువడంతో వరదలు వచ్చే పరిస్థితి నెలకొంది. సాయంత్రం నుంచి భారీ వర్షం కురువగా.. పరిస్థితి మరింత దిగజారింది. కరాచీలోని 700 పవర్ ఫీడర్లు నిలిచిపోయాయి.

దీంతో సగానికిపైగా నగరం అంధకారంలో కూరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇళ్లు, ఆసుపత్రుల్లోకి వర్షం నీరు చేరిందని స్థానిక మీడియా తెలిపింది.బాల్డీ టౌన్, ఓరంగి టౌన్, నార్త్ కరాచీ, సుర్జనీ టౌన్, గుల్షన్-ఎ-మేమర్, ఓరంగి టౌన్, బహ్రియా టౌన్, సదర్, నార్త్ నజిమాబాద్, టవర్, లియాఖతాబాద్, నజీమాబాద్‌లో భారీ వర్షం ఇవాళ(ఆదివారం) కూడా కురుస్తూనే ఉంది.

ఇక విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు రాత్రి అంధకారంలో గడిపారు. పాకిస్తాన్ వాతావరణ శాఖ (పిఎమ్‌డి) ఒక రోజు ముందే భారీ వర్షం పడుతుందని హెచ్చరించినప్పటికీ వర్షాన్ని ఎదుర్కోవడానికి నగర పరిపాలన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో చాలా రోడ్లు నీటితో నిండిపోయాయి. ప్రయాణికులు వారి వాహనాలలో చిక్కుకున్నారు. కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్, భారీ వర్షాల తర్వాత నగరంలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 198 పోస్టులు

Latest News

More Articles