Tuesday, May 21, 2024

భారీ షాక్.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ క్యాన్సిల్ ?

spot_img

ఎప్పుడెప్పుడా అని మెగా నందమూరి అభిమానులంతా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఇంటర్వ్యూ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తుంటే.. ఆహ టీమ్ ఇప్పుడు వాళ్ళకి భారీ షాక్ ఇచ్చేసింది. జనవరి 12న పవన్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అంటూ వచ్చిన ఊహాగానాలతో ఏర్పడ్డ ఫ్యాన్స్ ఉత్సాహానికి బ్రేక్స్ వేశారు. అందరు అనుకున్నట్టు అన్ స్టాపబుల్ పవన్ ఎపిసోడ్ సంక్రాంతి నుండి తప్పుకుంది. బాలయ్య పవన్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ని నిలిపివేసింది ఆహ. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ కి అనూహ్యంగా బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీ టీమ్ ఇంటర్వ్యూ ఉండనున్నట్టు అధికారిక ప్రకటన చేసి.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది ఆహ.

ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఆహా ప్రకటన చేసింది. దాంతో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు పోసినట్టు అయిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని పండగ సీజన్ నుండి తప్పించి.. మరో డేట్ ని కూడా అనుకుంటున్నారట. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ బాలయ్యల ఎపిసోడ్ టెలికాస్ట్ ఉండనుందట. అయితే జనవరి 26 స్ట్రీమింగ్ కి మంచి డేటే కానీ.. సంక్రాంతి అయితే వరుసగా సెలవులు వస్తాయి కాబట్టి పవన్ ఎపిసోడ్ మరింత వైరల్ అయ్యే అవకాశాలు ఉండేవని, అనవసరంగా క్యాన్సిల్ చేశారని అభిమానాలు మండిపడుతున్నారు. ఇక సంక్రాంతికి మాత్రం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రోమోలను విడుదల చేయాలని ఆహ టీమ్ భావిస్తోందట.

Latest News

More Articles