Wednesday, May 22, 2024

దేశం కాని దేశంలో వేధింపులు.. భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

spot_img

హైదరాబాద్: వివాహం చేసుకొని దేశం కాని దేశంలో వేధింపులకు గురిచేసిన భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేపట్టింది. దోమలగూడకు చెందిన మహేందర్ కుమార్తే రామేశ్వరి ఎంఎస్సీ పూర్తి చేసింది. బంధువుల ద్వార సత్యనారాయణ కుమారుడు మహేష్ కు రూ. 10 లక్షల నగదు, 20తులాల బంగారం ఇచ్చి మే 26న వివాహం జరిపించారు.

ఎన్నారై సంబంధమని ఘనంగా వివాహం జరపగా వివాహం చేసుకున్న వారం రోజుల నుంచే మహేశ్ వేధింపులు ప్రారంభించాడు. జూలై 18 న భార్యను అమెరికాలోని టెక్సాస్కు తీసుకువెళ్లిన మహేష్ మొదటి రోజు నుంచి వేధింపులు ప్రారంభించాడు.

తక్కువ కట్నం తెచ్చావాంటూ నిత్యం వేధించడంతో పాటు హుక్కా తాగాలంటూ వేధించేవాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తప్పుడు కారణాలతో ఇండియాకు తీసుకొచ్చిన మహేష్ ఆమెని ఇక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఎలాగోలా తిరిగి అమెరికా చేరుకున్న ఆమెను మరింత వేధింపులకు గురి చేయడంతో పాటు డైవర్స్ ఇవ్వాలంటూ వేధించేవాడని బాధితురాలు తెలిపింది.

కుటుంబ సభ్యులు అక్కడి ప్రభుత్వ అధికారుల సహాయంతో ఇండియాకు చేరుకున్న బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ అత్తవారింటికి వద్దకు రాగా ఆమె పైన ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలు యూసఫ్ గూడా ఎల్ఎన్ నగర్ లోని భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. సమాచారం అందుకున్న బంజారా హిల్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తనకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తామని బాధితురాలు తెలిపింది.

Latest News

More Articles