Sunday, May 19, 2024

సీతక్క మాట్లాడుతుండగా కరెంట్ కట్.. నెటిజన్స్ కామెడీ

spot_img

తెలంగాణలో ప్రభుత్వం మారిన తరువాత హైదరాబాద్ వాసుల కరెంట్ కష్టాలు అమాంతం పెరిగాయి. ఈ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. గత కొంత కాలంగా తరచూ విద్యుత్ కోతలు, జంట నగరాలను వేధిస్తూ వస్తున్నాయి. డిమాండ్ కి అనుగుణంగా విద్యుత్ సరఫరా అందడం లేదనేది ప్రధాన ఆరోపణ. విద్యుత్ కోతల ప్రభావం హైదరాబాద్ కి మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడిందనడానికి ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలే నిదర్శనం. ప్రజావాణి కార్యక్రమంలో కూడా కరెంట్ కష్టాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన రోజులు కూడా ఉన్నాయి. ట్రాన్స్ ఫార్మర్లు తరచరూ కాలిపోయే ఉదంతాలు తరచూ చోటు చేసుకుంటూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మంత్రి సీతక్కకు కూడా కరెంట్ కష్టాలు తప్పలేదు. సీతక్క విలేకర్ల సమావేశంలో మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా కరెంట్ సరఫరా స్థంబించిపోయింది. దీంతో కొద్దిసేపు ఆమె చీకట్లో గడపాల్సి వచ్చింది. ప్రెస్ మీట్ ను సైతం నిలిపివేయాల్సి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ గాంధీ భవన్ లో చోటు చేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలపై సీతక్క మాట్లాడుతున్న సమయంలోనే.. కాంగ్రెస్ పాలిస్తున్నప్పుడు కరెంట్ పోయింది. దీంతో ఈ వీడియోపై నెటిజన్స్ కామెడీ చేస్తున్నారు. అప్పట్లో అసలు కరెంట్ కష్టాలే తక్కువ.. ఒక వేళ కట్ అయినా అవన్నీ టెక్నీకల్ ఇష్యుస్ మాత్రమే. కానీ కాంగ్రెస్ వచ్చాకా.. క్రమంగా 24గంటల కరెంట్ ని తగ్గిస్తూ కోతలు పెడుతున్నారని భావిస్తున్నారు ప్రజలు.

Latest News

More Articles