Thursday, May 9, 2024

వైసీపీ ఎంపీ అభ్యర్థిగా దర్శకుడు వివి వినాయక్ ?

spot_img

సినిమా దర్శకుడు వివి వినాయక్ వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.. ఈ మేరకు ఇప్పటికే సంప్రదింపులు పూర్తయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వినాయక్‌ను ఎక్కడ నుంచి బరిలోకి దింపాలి అనేదానిపై అధిష్ఠానం దృష్టి పెట్టింది.. ఈ మేరకు పలు స్థానాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఏలూరు, మచిలీపట్నం, కాకినాడ స్థానాల్లో ఏదో ఒక స్థానంలో వివి వినాయక్ ను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టిన వైసీపీ.. ఆయా స్థానాల్లో కీలక అభ్యర్థులను రంగంలోకి దించనుంది. ఈ క్రమంలో వివి వినాయక్ పేరును పార్టీ అధిష్టానం పరిశీలించి.. సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.. ఈ క్రమంలో వివి వినాయక్ వైసీపీ పార్టీలో చేరితే.. పోటీ చేసే స్థానంపై క్లారిటీ రానుంది. అయితే, వైసీపీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలపై వివి వినాయక్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.. ఆయన స్పందించిన తర్వాత అసలు విషయం తెలియనుంది.

Latest News

More Articles