Saturday, May 18, 2024

న్యాయం కోసం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా

spot_img

జయశంకర్ యూనివర్సిటీలో తెలంగాణ ప్రభుత్వం కొత్త హైకోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో కొత్త హైకోర్టు నిర్మాణ GO-55 ను రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన గత కొద్దిరోజులుగా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా అగ్రికల్చర్ యూనివర్సిటీ A.D కార్యాలయం ముందు విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు.

తక్షణమే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ విధులు బహిష్కరించి మాకు మద్దతు తెలపాలని విద్యార్థుల డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తరగతులను బహిష్కరించి ధర్నాలో పాల్గొన్నారు. హైకోర్టుకు మంజూరు చేసిన GO 55ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంకు సంబంధించిన స్థలంలో ఒక్క గజం కూడా ఇవ్వడానికి వీలులేదన్నారు. హైకోర్టు నిర్మాణ ప్రతిపాదనను వేరే చోటుకు మార్చాలని హెచ్చరించారు.

Latest News

More Articles