Tuesday, May 21, 2024

ఆస్కార్ వేడుకలకు నిరసనల సెగ

spot_img

గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనల సెగ ఆస్కార్ ను తగిలింది. ఆందోళనకారులు లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ దగ్గరకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పలువురు ప్రముఖులు కార్యక్రమానికి ఆలస్యంగా చేరుకున్నారు. నిరసనలపై ముందే సమాచారం ఉన్న లాస్ ఏంజిల్స్ పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. వేడుకల చుట్టుపక్కల ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ ఆందోళనకారులు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. పెద్దెత్తున నినాదాలు చేశారు. తమకు మద్దతుగా నిలవాలని వేడుకకు వచ్చే ప్రముఖులను కోరారు. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు అందుకున్ను బిల్లీ ఇలిష్, ఫినియాస్, గాజాకు మద్దతిస్తూ ప్రత్యేక బ్యాడ్జీని ధరించారు. ఇంకొంతమంది ప్రముఖులు కూడా నల్లబ్యాడ్జీలను ధరించారు.

ఇది కూడా చదవండి: ఘనంగా ఆస్కార్‌ వేడుక.. ఓపెన్‌ హైమర్‌కు అవార్డుల పంట.!

Latest News

More Articles