Friday, May 17, 2024

తుక్కుగూడ సభ తుక్కుతుక్కేనా.. కాంగ్రెస్ ఆశలపై నీళ్లు..!!

spot_img

తెలంగాణ కాంగ్రెస్ సెప్టెంబర్ 17న హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో విజయభేరి పేరుతో ఒకవైపు భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్దమవుతున్న తరుణంలో షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరుకానున్న ఈ సభ కోసం పది లక్షల జనసమీకరణ చేయాలని భావిస్తుంటే పట్టుమని పది వేల మంది కూడా హాజరు కాలేని పరిస్థితి నెలకొంది.

అయితే తాజాగా కాంగ్రెస్ సభకు పోలీసులు అనుమతించినా 25 షరతులను విధించారు. అందులో సభకు వచ్చే వారి సంఖ్య 10 వేలకు మించరాదని, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే సభను నిర్వహించాలనే షరతులు కూడా ఉన్నాయి. అయితే ఈ షరతులు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలనే కాంగ్రెస్ పార్టీ ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తున్నాయి.

తుక్కుగూడలో కాంగ్రెస్ సభకు అనుమతించిన రాచకొండ పోలీసులు విధించిన షరతులను పరిశీలిస్తే.. ప్రొఫెషనల్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నిమగ్నం చేయాలి, ఒకే బాక్స్ రకం స్పీకర్‌ను ఉపయోగించాలి, 55 డీబీ కంటే తక్కువ శబ్దం స్థాయిని నిర్వహించాలి, డ్రోన్ల వినియోగంపై నిషేధం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదు, రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేయరాదు, నిర్వాహకులు తప్పనిసరిగా డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్‌హెల్డ్ మెటల్ డిటెక్టర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి, హాట్ ఎయిర్ బెలూన్‌లపై నిషేధం వంటివి ఉన్నాయి.

Latest News

More Articles