Sunday, May 19, 2024

రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యలకు ‘40% కమిషన్’పై కోర్టు సమన్లు

spot_img

కర్ణాటకలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ‘‘40% కమీషన్’’ ఆరోపణలు ఎంతగానో సహకరించాయి. బీజేపీ ప్రభుత్వం ప్రతీ విషయంలో కమీషన్ తీసుకుంటుందని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో బీజేపీ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు కోర్టు సమన్లు జారీ చేసింది.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ‘పేసీఎం’ వంటి పోస్టర్లను ప్రచురించింది. 40 శాతం కమిషన్ తీసుకుంటుందని ఆరోపించింది. ఈ ప్రకటనపై బీజేపీ లీగల్ విభాగం ఫిర్యాదుపై, కాంగ్రెస్ నేతలు మార్చి 28న ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో హాజరుకావాలని కోరింది. ఇప్పటికే కర్ణాటక హైకోర్టు 40 శాతం కమీషన్ ఆరోపణలపై ఆరు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రస్తుతం బీజేపీ కూడా ఇదే తరహా ఆరోపణల్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తోంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి గత వారం కర్ణాటక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పాలనలో 40 శాతానికి బదులుగా 50 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: ముగిసిన ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు..!

Latest News

More Articles