Wednesday, May 22, 2024

ప్రమాద బాధితుల పరిహారం పది రెట్లు పెంచిన రైల్వే శాఖ

spot_img

రైలు ప్రమాదాల్లో ఎవరైనా మరణించినా లేదా గాయపడినా ఇచ్చే పరిహారాన్ని పది రెట్లు పెంచుతున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఈ నెల 18న విడుదల చేసింది. బాధితులకు ఇచ్చే పరిహారాన్ని చివరిసారిగా 2013లో సవరించారు. పెంచిన పరిహారం ప్రకారం.. చనిపోయిన వారికి రూ. 5 లక్షలు అందిస్తారు. గతంలో ఇది రూ. 50 వేలుగా మాత్రమే ఉండేది. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షలు అందజేస్తారు, గతంలో ఇది కేవలం రూ. 25 వేలుగా ఉండేది. అదేవిధంగా స్వల్ప గాయాలైన వారికి రూ. 50 వేలు ఇవ్వనుండగా, గతంలో రూ. 5 వేలు మాత్రమే ఇచ్చేవారు.

Read Also: నేడు రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ.. ఏ ప్రాంతాల వారికి ఎక్కడ ఇస్తారంటే..

కాగా.. రైల్వే క్రాసింగ్ వద్ద జరిగే ప్రమాదాలలో కాపలాదారులు ఉన్న చోట జరిగిన ప్రమాదాలకే ఈ నియమం వర్తిస్తుందని రైల్వే బోర్డు తెలిపింది. అదేవిధంగా 30 రోజులకు మించి ఆసుపత్రిలో ఉంటే రోజుకు రూ. 3 వేల చొప్పున ప్రతి 10 రోజులకొకసారి ఇస్తారు. అదే అవాంఛనీయ సంఘటనలలో తీవ్రంగా గాయపడిన ప్రయాణీకులకు ప్రతి 10 రోజులకు రూ. 1,500 చొప్పున ఆరు నెలల వరకు ఇస్తారు. ఆ తర్వాత రోజుకు రూ. 750 చొప్పున విడుదల చేస్తారు.

Read Also: అప్పు కట్టలేదని మార్కెట్లో నగ్నంగా ఊరేగింపు

కాపలాదారుల్లేని లెవెల్‌క్రాసింగ్‌ గేట్ల వద్ద జరిగే ప్రమాదాలకు, రైల్వే నిబంధనలను అతిక్రమించినవారికి, రైలు మార్గాల విద్యుదీకరణ వ్యవస్థ వల్ల విద్యుదాఘాతానికి గురైనవారికి ఎక్స్‌గ్రేషియా లభించబోదని రైల్వేబోర్డు స్పష్టంచేసింది. రైలు ప్రమాదాలు మరియు అవాంఛనీయ సంఘటనలలో ప్రయాణీకుల మరణం లేదా గాయపడితే వారికి పరిహారం అందించాలని 1989 రైల్వే చట్టం నిర్దేశించింది.

Latest News

More Articles