Friday, May 17, 2024

తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు..ఎల్లో అలెర్ట్‌ జారీ

spot_img

తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే సూచనలున్నాయంది. ఇవాళ (శుక్రవారం) నుంచి రేపు(శనివారం) ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురవనున్నట్లు తెలపింది. వర్షాల కారణంగా ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ. శనివారం నుంచి బుధవారం వరకు చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవుతుందని చెప్పింది.

శుక్రవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైందని తెలిపింది వాతావరణ శాఖ.

Latest News

More Articles