Thursday, May 2, 2024

మలేషియన్ టౌన్షిప్ మావోయిస్టు సంజయ్ అరెస్ట్

spot_img

మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ సంజయ్ దీపక్ రావుని అరెస్ట్ చేశాం అని డీజీపీ అంజనీ కుమార్ అధికారిక ప్రకటన చేశారు. ‘ఈ రోజు ఉదయం కూకట్పల్లి మలేషియన్ టౌన్షిప్ లో సంజయ్ దీపక్ రావు ని అరెస్ట్ చేశాం. థానే జిల్లా మహారాష్ట్ర కి చెందిన ఇతనిపై లాస్ట్ ఇయర్ నుంచి ఫోకస్ పెట్టాం. ఇతని తండ్రి కమ్యూనిస్టు ట్రేడ్ యూనియన్ లీడర్. జమ్మూకాశ్మీర్ లో సపెరిటీస్ట్ గ్రూప్ తో కూడా సంబంధాలున్నాయి. మహారాష్ట్రకి ఇంచార్జ్ గా పని చేశాడు. 2000 లో మహారాష్ట్రలో మొదటగా అరెస్ట్ అయ్యాడు. జైల్ కి వెళ్లి వచ్చిన తర్వాత మళ్ళీ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 2005 లో కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. జైల్ కి వెళ్లి వచ్చిన తర్వాత తిరిగి మావోయిస్టులతో కలిసి పని చేశాడు.

మాదాపూర్ లో ఉంటున్న ఫిల్మ్ ఎడిటర్, మలేషియన్ టౌన్షిప్ లో ఉంటున్న ఇంకొందరు ఇతనికి సహకరిస్తున్నారు. ఇతని దగ్గరి నుంచి ఒక పిస్టల్, ఆరు రౌండ్స్ బుల్లెట్స్, ఒక ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నాం. మహారాష్ట్ర పోలీసులు 25 లక్షల రివార్డు ప్రకటించారు. NIA, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా దీపక్ రావు ఉన్నాడు. రాష్ట్ర ఏర్పాటు అయ్యాక తెలంగాణలో మావోయిస్టుల యాక్టివిటీస్ పూర్తిగా తగ్గిపోయాయి. రాష్ట్రంలో ఎక్కడ మావోయిస్టుల యాక్టివిటీ లేదు
తెలంగాణ బోర్డర్స్ లో కొంత యాక్టివిటీస్ జరుగుతున్నాయి. గత పదేళ్లుగా తెలంగాణ నుంచి మావోయిస్టు కొత్త రిక్రూట్మెంట్ లేదు. దీపక్ రావు భార్య కూడా మా సర్వీలియెన్స్ లో ఉంది’ అని చెప్పారు అంజనీ కుమార్.

Latest News

More Articles