Sunday, May 19, 2024

ఎన్నికల ప్రచారంలో రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మృతి

spot_img

ఎన్నికల ప్రచారం చేస్తూ అనారోగ్యంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నుమూశాడు. ఈ ఘటన రాజస్థాన్‎లో జరిగింది. కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గుర్మీత్ సింగ్ కూనర్ (75) పోటీలో ఉన్నారు. ఆయన నవంబర్ 4న తన నామినేషన్ కూడా వేశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. తాజాగా ఈ నెల 12న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దాంతో వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనను పరిశీలించిన వైద్యులు.. కూనర్‎కు కిడ్నీ ఇన్‎ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన.. ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.

Read Also: ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల.. వన్డేల్లో నెంబర్ వన్ బ్యాట్‎మెన్‎గా శుభమన్ గిల్

రాజస్థాన్‎లో నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. కాగా.. ఓటింగ్‎కు పది రోజుల ముందు గుర్మీత్ సింగ్ మరణించడంతో ఇప్పుడు ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. గుర్మీత్ సింగ్ కరణ్‌పూర్ నుండి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన 2018 ఎన్నికల్లో సురేంద్రపాల్ సింగ్, పృథివాల్ సింగ్ సంధులను ఓడించి మంత్రి అయ్యారు. ఈసారి కూడా ఈ ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.

కాగా.. 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25న 199 స్థానాలకు మాత్రమే ఓటింగ్ జరుగనుంది. ఇలా 199 స్థానాలకు ఓటింగ్‌ జరగడం మూడోసారి కావడం గమనార్హం. రాజస్థాన్‎లో 2013, 2018లో కూడా 199 స్థానాలకు మాత్రమే ఓటింగ్ జరిగింది.

Latest News

More Articles