Sunday, May 19, 2024

ఖమ్మానికి పువ్వులు కావాలా? తుమ్మ ముల్లులు కావాలా?

spot_img

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు తమ ప్రచారంలో బిజీగా ఉన్నారు. తాజాగా ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్.. స్థానికంగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ.. ఖమ్మ పట్టణానికి తుమ్మల నాగేశ్వరరావు చేసింది ఏమీ లేదని అన్నారు. ‘ఇక్కడ నా చేతిలో ఓడిపోయి తుమ్మల పాలేరు వెళ్ళాడు. ఇప్పుడు మళ్లీ ఖమ్మం వచ్చాడు. సత్తుపల్లి, పాలేరులో చెల్లని రూపాయి ఖమ్మంలో చెల్లుతుందా? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి మీ కళ్ళ ముందు కనపడుతుంది. నగరంలో ప్రజలకు అందిన మౌలిక సదుపాయాలను ప్రజలు గమనించాలి. తాను ఏం అభివృద్ధి చేశాడో చెప్పలేక ఖమ్మంలో సాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, గుట్టలు మాయం అవుతున్నాయని అసత్య ప్రచారాలను తుమ్మల ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా మిమిక్రీతో నా ఫేక్ వాయిస్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

Read Also: ఎన్నికల ప్రచారంలో రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మృతి

నేను ఎప్పుడు ఎవరిని ఒరేయ్ అని పిలవలేదు. అక్క, తమ్ముడు, అన్న, అమ్మ, తాత, అవ్వ అని మాత్రమే పిలుస్తాను. అధికారులను పేరుతో కూడా పిలువను. ప్యాకేజీలు తీసుకొని కొందరు కండవాలు మారుస్తున్నారు. ఇప్పుడు రింగ్ రోడ్డు చేస్తానని అంటున్నాడు. సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఎందుకు చేయలేకపోయావు? నాకు మరోసారి అవకాశం ఇస్తే ఖమ్మాన్ని మెట్రో నగరంగా తీర్చిదిద్దుతాను. నాకు పదవి వస్తే ఖమ్మానికి అలంకారం.. అదే తుమ్మలకి పదవి వస్తే ఆయనకు మాత్రమే అలంకారం. ఖమ్మానికి పువ్వులు కావాలి కానీ తుమ్మ ముల్లులు వద్దు అని సీఎం కేసీఆర్ చెప్పారు’ అని మంత్రి పువ్వాడ అన్నారు.

Latest News

More Articles