Saturday, May 18, 2024

కడపలో సూపర్ స్టార్ రజనీకాంత్ సందడి.. భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్..!!

spot_img

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కడపలో సందడి చేశారు. రజనీ నటిస్తున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ కడపలో జరుగుతుండటంతో ..ఆయన ఇక్కడికి వచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉన్ననాపరాయి క్వారీలో తలైవా తాజా మూవీ షూటింగ్ జరుగుతోంది. అందులో భాగంగా రజనీకాంత్ సినిమా కు సంబంధించి కొన్ని సన్నివేశాలు ఈ క్వారీలోనే చిత్రీకరిస్తున్నారు.

అయితే ఈ షూటింగ్ కోసం చెన్నై నుంచి మంగళవారం కడపకు చేరుకున్నారు. రజనీకాంత్ జమ్మలమడుగు వచ్చిన విషయం తెలసుకున్న జనం భారీ ఎత్తున ఎగబడ్డారు. సూపర్ స్టార్ వచ్చాడంటూ చుట్టు ప్రక్కల ప్రాంతాలకు పాకడంతో దూర ప్రాంతాల నుంచి రజనీని చూడటానికి షూటింగ్ స్పాట్ కువచ్చారు. రజనీకాంత్ నటిస్తున్న 170 వ సినిమా వెట్టయాన్ కు సంబంధించిన యాక్షన్ సీన్స్ ఇక్కడ షూటింగ్ జరుగుతోంది. జమ్మలమడుగులోని ఎర్రగుంట్ల పురపాలక సంఘానికి చెందిన కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డికి చెందిన క్వారీలో ఈ షూటింగ్ జరుగుతుంది. మొత్తం రెండు రోజులు పాటు ఈ షూటింగ్ జరగనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఇది కూడా చదవండి : తమిళనాడు హైకోర్టు సంచలన తీర్పు..దేవాలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశం నిషేధించాలని ఆదేశం..!!

Latest News

More Articles