Sunday, May 19, 2024

నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు.. పాటించాల్సిన నియమాలేంటి?

spot_img

ముస్లింలు రంజాన్‌కు ముందు నెల రోజుల పాటు ఉపవాసం ఉండడం ఆనవాయితీ. రంజాన్ మాసం ఒక్కో ప్రాంతంలో నెలవంక దర్శనం ప్రకారం ప్రారంభమవుతుంది. సౌదీ అరేబియాలో ఆదివారం రంజాన్ నెలవంక కనిపించింది. దీంతో సౌదీ అరేబియా సహా గల్ఫ్ దేశాల్లో నిన్న(సోమవారం) నుంచి రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి.మన దేశంలో ఏప్రిల్ 11న నెలవంక కనిపించింది. రంజాన్ పండుగ జరుపుకోవాలని ముస్లిం పెద్దలు ప్రకటించారు. ఉపవాసాలు, ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు.

ఉపవాస సమయంలో పాటించాల్సిన నియమాలేంటి?

1. పవిత్ర రంజాన్ మాసంలో, ముస్లింలు అన్ని రకాల అపవిత్రతకు దూరంగా ఉండాలి. తమ మనస్సును ప్రార్థనలు, ఆత్మ స్వచ్ఛత, ఆధ్యాత్మికత,దాతృత్వంపై కేంద్రీకరించాలి. ఇది ఎప్పటి నుంచో ఇస్లామిక్ ప్రజలు అనుసరిస్తూ వస్తున్నారు.

2. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం ఈనెలలో ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవచ్చు.

3. గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలు, శారీరకంగా లేదా మానసికంగా బాధపడే స్త్రీలకు ఈ సమయంలో ఉపవాసం నుండి మినహాయింపు ఉంటుంది. యుక్తవయస్సు వచ్చిన పిల్లలకు ఉపవాసం చేయడం తప్పనిసరి కాదు. అదేవిధంగా, చాలా పెద్ద పెద్దలు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు.

4. సాంప్రదాయకంగా, ప్రజలు తమ ఉపవాసాన్ని ఖర్జూరాలతో ముగిస్తారు.

5. రంజాన్, అతిపెద్ద ఇస్లామిక్ పండుగ. ఒక నెల ఉపవాసం ముగింపు గుర్తుగా జరుపుకుంటారు. ఈ మాసంలో పండుగ రోజున చంద్ర దర్శనం తర్వాత ఉపవాసం ముగుస్తుంది. ఈ ప్రత్యేక రంజాన్ వేడుకలో అన్నదానం చేస్తుంటారు. ఆహారాన్ని చుట్టుపక్కల బంధువులు, స్నేహితులకు పంచుతుంటారు. ఈ మాసంలో దానం చేస్తే మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. పేదవారికి బట్టలు, ఆహారం, డబ్బులు దానం చేస్తుంటారు.

ఇది కూడా చదవండి : పార్టీ మారే ప్రసక్తే లేదు..చివరి వరకు కేసీఆర్‎తోనే నా ప్రయాణం.!

Latest News

More Articles