Sunday, May 19, 2024

ప్రేమంటే ఇదేరా.. వైరలవుతున్న ఉపాసన ట్వీట్‌!

spot_img

హైదరాబాద్: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ -ఉపాసన దంపతులు ప్రతిష్టాత్మక ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెరిసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఏ టాలీవుడ్‌ జంటకు ఆ ఛాన్స్‌ రాలేదు. మొదటిసారి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు రామ్ చరణ్ దంపతులు. దీనిపై ఉపాసన స్పందించారు.

‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందని చెబుతుంటారు. కానీ నా విజయం వెనుక మాత్రం మద్దతు, రక్షణ ఇచ్చే చరణ్ ఉన్నాడు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ కవర్‌పేజ్‌ ఫొటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.  11 ఏళ్ల క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Latest News

More Articles