Wednesday, May 22, 2024

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాలి

spot_img

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని రామోజీ రావు ఆకాంక్షించారు. త్వ‌ర‌గా కోలుకొని రెట్టించిన ఉత్సాహంతో ప్ర‌జా సేవ‌కు పున‌రంకితం అవుతార‌న్నారు. ఈ మేర‌కు ఎమ్మెల్యే కేటీఆర్‌కు రామోజీరావు లేఖ రాశారు.

కేసీఆర్‌కు హిప్ రిప్లేస్‌మెంట్ శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంత‌మైంద‌ని, ఆయ‌న కోలుకుంటున్నార‌ని డాక్టర్లు తెలిపారు. ప్ర‌స్తుతం వాక‌ర్ సాయంతో కేసీఆర్ న‌డుస్తున్నార‌ని, మ‌రో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవ‌కాశం ఉంద‌న్నారు. 6 నుంచి 8 వారాల రెస్ట్ అవ‌స‌ర‌మ‌ని డాక్టర్లు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితి మెరుగుప‌డుతుంద‌ని తెలిపారు. త్వ‌రిత‌గ‌తిన కోలుకోవ‌డానికి అనుకూలంగా కేసీఆర్ శ‌రీరం స‌హ‌క‌రిస్తోంద‌న్నారు. మాన‌సికంగా కూడా కేసీఆర్ దృఢంగా ఉన్నార‌ని తెలిపారు డాక్ట‌ర్లు.

ఇది కూడా చదవండి:ఆపరేషన్ తర్వాత నడవడానికి కేసీఆర్ ప్రయత్నం

Latest News

More Articles