Monday, May 20, 2024

బీఆర్ఎస్ కే భారీగా ఎంపీ సీట్లు..!

spot_img

బీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీల కలయికని ఎండగట్టారు. ‘కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి బిఆర్ఎస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పొద్దున్నే బి ఆర్ ఎస్ పార్టీ ని తిట్టాందే వాళ్లకి ఓట్లు పడవు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డి కి మంచి అవగాహన ఉంది. గవర్నర్ కోటా కిందా ఉన్న ఎమ్మెల్సీ లను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు.

బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒక్కటే. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి లోపయకారి ఒప్పంధాన్ని ప్రజలు గుర్తిస్తారు. రెండు కలసి బిఆర్ఎస్ పార్టీని దెబ్బతీయలని చూస్తున్నారు. తెలంగాణను తెచ్చిన నాయకుడి కేసీఆర్ గారి పైన ఇస్తానుసారం మాట్లాడితే ప్రజలు సహించారు, సరైన సమయం లో బుద్ది చెప్తారు. ఇచ్చిన, ఇవ్వని హామీలను కూడా బి ఆర్ ఎస్ ప్రభుత్వం అమలు పరిచింది. మా నాయకుడు కేసీఆర్ గారు ప్రజలకు 24 గంటలు కరెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీ సిట్టింగ్ సీట్లు గెలిస్తే చాలు. బి ఆర్ ఎస్ పార్టీ భారీగా ఎంపీ సీట్లును గెలవబోతుంది. మీకు చిత్తశుద్ధి పార్లమెంట్ ఎన్నికల లోపల హామీలను పరచాలి అని నిలదీసాడు శ్రీధర్ రెడ్డి.

Latest News

More Articles