Saturday, May 18, 2024

రూ. 2 వేల నోట్లపై ఆర్బీఐ మరో కీలక నిర్ణయం

spot_img

రూ. 2 వేల నోట్లపై ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2వేల నోట్ల మార్పిడి గడువు తేదీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. రూ.2 వేల నోట్లను అక్టోబర్ 7 వరకు మార్చుకోవచ్చని పేర్కొంది. గతంలో ఈ నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.

Read Also: అక్టోబర్ 2న డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ.. ఏ మంత్రి ఎక్కడ పంపిణీ చేస్తారంటే..

రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఈ ఏడాది మే 19న ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నోట్లను బ్యాంకులో డిపాజిట్‌ లేదా మార్పిడి చేసుకోవాల్సిందిగా సూచించింది. కాగా.. ఈ నెల 1న ఆర్‌బీఐ విడుదల చేసిన ప్రకటనలో 93 శాతం రూ.2,000 నోట్లు మార్కెట్లో నుంచి వెనక్కి వచ్చాయని తెలిపింది. వీటి విలువ రూ.3.32 లక్షల కోట్లని పేర్కొంది. ఇంకా రూ.24,000 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు వెనక్కి రావాల్సి ఉందని తెలిపింది. వచ్చిన నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో ఉండగా, మిగతా 13 శాతం వరకూ మార్పిడి చేసుకున్నట్లు పేర్కొంది.

Read Also: ఎన్టీఆర్ సాధించని హ్యాట్రిక్.. ఆయన శిష్యుడిగా కేసీఆర్ సాధించబోతున్నారు

చిన్నారి దీక్షిత్ రెడ్డి హత్య కేసు: ముద్ధాయికి మరణ శిక్ష

Latest News

More Articles