Sunday, April 28, 2024

ఎన్టీఆర్ సాధించని హ్యాట్రిక్.. ఆయన శిష్యుడిగా కేసీఆర్ సాధించబోతున్నారు

spot_img

తెలుగువారందరికీ ఎన్టీఆర్‌ ఆరాధ్య దైవమని మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌ బండ్‌పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ పార్క్‌‎ను మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కలిసి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Read Also: మీకు సేవ చేయడమే నా బాధ్యత

‘తారక రాముడి ఆశీస్సులతో ఆయన శిష్యుడిగా కేసీఆర్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరోసారి రాష్ట్ర ప్రజల అభిమానంతో మూడోసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారు. ఎన్టీఆర్ ఎన్నో ఘనతలు సాధించారు, కానీ దక్షిణ భారతదేశం నుంచి మూడుసార్లు ముఖ్యమంత్రి కాలేకపోయారు. అయితే ఆ ఘనతను ఆయన శిష్యుడు, మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ సాధించబోతున్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయితే అన్న ఎన్టీఆర్ ఆత్మ కూడా శాంతిస్తుంది’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Read Also: చుట్టూ కొబ్బరి పీచు.. మధ్యలో గంజాయి ప్యాకెట్లు

‘ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహానాయకుడు ఎన్టీఆర్‌. రాముడు ఎలా ఉంటాడో తెలియదు.. కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు.. మాకు రాముడైనా, కృష్ణుడైనా ఆయనే. భారత దేశంలో తెలుగు వారంటూ ఉన్నారని గుర్తించేలా చేసింది ఎన్టీఆరే. చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం నా అదృష్టం. నాకు తారక రామారావు పేరు ఉండటం చాలా సంతోషంగా ఉంది. తారక రామారావు పేరులోనే పవర్‌ ఉంది. ఎన్టీఆర్‌ శిష్యుడిగా కేసీఆర్‌ తెలంగాణ అస్తిత్వాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పారు’ అని కేటీఆర్‌ అన్నారు.

Read Also: మోడీది మాటల్లో దేశభక్తి.. చేతల్లో దేశద్రోహం

Latest News

More Articles