Saturday, May 11, 2024

కేసీఆర్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్, బీజేపీలకు మెంటల్ ఎక్కడం ఖాయం

spot_img

పగటి వేశగాళ్లలాగా వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హిమాయత్ నగర్ డివిజన్‎లో రూ. 17 లక్షలతో మంచినీటి పైప్ లైన్ శంకుస్థాపన చేయడంతో పాటు రూ. 39 లక్షల విలువైన షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు.

Read Also: ఎన్టీఆర్ సాధించని హ్యాట్రిక్.. ఆయన శిష్యుడిగా కేసీఆర్ సాధించబోతున్నారు

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించబోయే మ్యానిఫెస్టోతో కాంగ్రెస్‎కు, బీజేపీకి మెంటల్ ఎక్కడం ఖాయం. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రుమ్స్ నిర్మించి ఇస్తున్నారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇవ్వలేని గ్యారంటీ పథకాలు తెలంగాణలో మాత్రం ఎలా ఇస్తారో ప్రజలు ఆలోచించాలి. గత ప్రభుత్వాలు ఎంత పింఛన్ ఇచ్చాయో మీకు తెలుసు. తెలంగాణ ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక.. వృద్ధులకు పింఛన్ 2 వేలు, వికలాంగులకు 4 వేలు ఇస్తున్నారు. పగటి వేశగాళ్లలాగా వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఝూటా మాటలు నమ్మొద్దు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‎ను బలపరిచి, మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నిరుపేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‎కు మీ అందరి ఆశీర్వాదం ఇవ్వాలి. నిరుపేదలకోసం దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారు. మరోసారి గెలిచాక కొత్తకొత్త పథకాలు నిరుపేదలకు అందిస్తారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలలో పెనుమార్పులు తీసుకొచ్చి, ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయం’ అని ఆయన అన్నారు.

Read Also: చుట్టూ కొబ్బరి పీచు.. మధ్యలో గంజాయి ప్యాకెట్లు

Latest News

More Articles