Saturday, May 18, 2024

కీలక వడ్డీ రేట్లు యథాతథం

spot_img

వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను యథాతధంగా ఉంచింది. రెపోరేటు 6.5 శాతంతో కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రెపోరేటులో ఆర్బీఐ ఎటువంటి మార్పులు చేయలేదన్నారు. ఎస్డీఎఫ్ రేటు 6.25 శాతం కొనసాగించామన్నారు. ఎంఎస్ఎఫ్ బ్యాంక్ రేట్ కూడా 6.75 శాతం యథాతథంగా ఉంచామన్నారు. ద్రవ్యోల్బణం తగ్గించేందుకే రెపోరేటు పెంచలేదని తెలిపారు.

మార్చి- ఏప్రిల్ 2023లో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం తగ్గిందని.. 2022-23లో 6.7% నుంచి క్షీణించిందన్నారు శక్తికాంత దాస్. అయితే లేటెస్ట్ డేటా ప్రకారం ద్రవ్యోల్బణం ఇప్పటికీ లక్ష్యానికి పైన ఉందన్నారు. 2023- 24కి సంబంధించి తమ అంచనాల ప్రకారం అలాగే ఉంటుందన్నారు. తమ అంచనా ప్రకారం, 2023-24లో ద్రవ్యోల్బణం 4% కంటే ఎక్కువగానే ఉంటుందన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.

Latest News

More Articles