Wednesday, May 22, 2024

ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకులకు భారీ ఆర్బీఐ జరిమానా

spot_img

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాకులు ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించలేదంటూ ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంకుకు రూ.3.95 కోట్ల చొప్పున జరిమానా విధించింది.

రుణాలు, అడ్వాన్సులు, చట్టబద్ధమైన, ఇతర నిబంధనలు, మోసాల వర్గీకరణ, కమర్షియల్ బ్యాంక్ రిపోర్టింగ్‌కు సంబంధించి ఆర్బీఐ జారీ చేసిన నిబంధనలు పాటించనందుకు ఐసీఐసీఐకి ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.

ఆర్థిక సేవల ఔట్ సోర్సింగ్‌లో రిస్క్ లు, ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు, రికవరీ ఏజెంట్లు, కస్టమర్ సర్వీసుకు సంబంధించిన ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినందుకు కోటక్ మహీంద్రా బ్యాంకుకు జరిమానా విధించింది. నిబంధనలు పాటించనందుకే ఈ జరిమానా అని, ఖాతాదారుల లావాదేవీలకు ఈ జరిమానాలతో సంబంధం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: నేను బతికి ఉన్నంతకాలం దళిత బంధు ఆగదు

Latest News

More Articles