Wednesday, May 22, 2024

మీ ఫోన్‎కి ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చిందా? కంగారొద్దు..

spot_img

దేశ వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచి చాలామంది ఫోన్లకు ఓ ఎమర్జెన్సీ మెసేజ్ వస్తోంది. దాంతో ఆ మెసెజ్ ఏంటా అని కంగారు పడుతున్నారు. మొబైల్ స్క్రీన్‎లపై ఎమర్జెన్సీ అలెర్ట్ అని వస్తోంది. దీంతో చాలా మంది ఉలిక్కిపడి, భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఈ మెసెజ్ గురించి ఎటువంటి భయం అవసరం లేదు. ఎందుకంటే ఈ మెసెజ్ టెలి కమ్యూనికేషన్స్ నుంచి వచ్చింది. అత్యవసర సమయాలలో ప్రజలను అలర్ట్ చేయడం కోసం ఈ మెసెజ్‎ను ట్రయల్‎గా పంపిస్తున్నారు. టెలీ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్‎ని ప్రయోగాత్మకంగా నిర్వహించింది. దానికి సంబంధించిన వార్నింగ్ మెసెజ్ మనకు డిస్ ప్లే అవుతోంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‎మెంట్ అథారిటీ అనుబంధంతో ఈ టెస్టింగ్ జరిగింది. భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల నుండి ప్రజల్ని అలర్ట్ చేయడానికి ట్రయల్ టెస్ట్ నిర్వహించారు.

Read Also: రజినీకి తెలంగాణ అభివృద్ధి అర్థమైంది కానీ.. ఈ గజినీలకు అర్థం కావట్లే

అప్పు కట్టలేదని మార్కెట్లో నగ్నంగా ఊరేగింపు

సింగరేణి కార్మికుల ఖాతాల్లో రూ.1450 కోట్లు

Latest News

More Articles