Saturday, May 18, 2024

ఐదోసారి టాప్ స్కోర‌ర్‌గా రొనాల్డో

spot_img

2023 ఏడాదిని ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ఘనంగా ముగించాడు. ఈ ఏడాది 54 గోల్స్‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. సౌదీ ప్రో లీగ్‌ లో శ‌నివారం ఆల్ త‌వోన్ జ‌ట్టుపై అత‌డు 54వ గోల్ కొట్టాడు. దీంతో ఐదు ప‌ర్యాయాలు ఈ ఫీట్ సాధించిన ఫుట్‌బాల‌ర్‌గా రొనాల్డో రికార్డు సృష్టించాడు. గ‌తంలో 2011, 2013, 2014, 2015లో అత‌డు అత్య‌ధిక గోల్స్ సాధించాడు. ఫ్రాన్స్ యువ కెర‌టం ఎంబాపే, ఇంగ్లండ్ స్టార్ హ్యారీ కేన్ 52 గోల్స్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో కొన‌సాగుతున్నారు. ఎర్లింగ్ హాలాండ్ 50 గోల్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత లియోన‌ల్ మెస్సీ 44 మ్యాచుల్లో 28 గోల్స్‌తో ఉన్నాడు.

Latest News

More Articles