Monday, May 13, 2024

సీఐడీ అధికారులమంటూ ఐటీ కంపెనీని బెదిరించి రూ. 10 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

spot_img

సీఐడీ అధికారులమంటూ ఐటీ కంపెనీని బెదిరించి రూ. 10 లక్షలు కాజేసిన కేటుగాళ్లను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాయదుర్గం పీయస్ పరిధిలోని గచ్చిబౌలిలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి మాదాపూర్ డీసీపీ వినీత్ ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు వెల్లడించారు.

‘గచ్చిబౌలిలో అజా యాడ్స్ అనే అమెరికన్ బేస్డ్ ఐటీ కంపెనీ ఉంది. దీన్ని దర్శన్, హరిప్రసాద్ అనే ఇద్దరు స్నేహితులు మరికొంతమందితో కలిసి నిర్వహిస్తున్నారు. అయితే ఏపీ సీఐడీ అధికారులమంటూ సోమవారం కంపెనీలోకి పది మంది వచ్చారు. మీరు మీ కంపెనీ ద్వారా చాలామందిని మోసం చేశారంటూ ఫేక్ ఐడీ కార్డులను చూపించి, బెదిరింపులకు దిగారు. అనంతరం 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. కంపెనీ మేనేజ్‌మెంట్ టీంలోని దర్శన్, హరిప్రసాద్‎లను కిడ్నాప్ చేసి హోటల్‎కి తీసుకెళ్ళారు. అక్కడ పదిలక్షల రూపాయలను తమ ఖాతాల్లోకి ట్రాన్సఫర్‌ చేయించుకున్నారు. డబ్బులు తీసుకున్న తరువాత వారిని వదిలేశారు. వారి నుంచి బయటపడిన వారిద్దరూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.

Read Also: నార్సింగి డ్రగ్స్ కేసులో హీరోయిన్ లావణ్య అరెస్ట్

విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కంపెనీలో గతంలో పనిచేసిన రంజిత్‌ అనే మాజీ ఉద్యోగితో కలిసి 9 మంది ఏపీ సీఐడీ అధికారుల అవతారమెత్తారు. కర్నూల్ డీఐజీ ఆఫీసులో ఎస్సైగా పనిచేస్తున్న సుజన్.. ఈ కుట్రలో కీలక పాత్ర పోషించాడు. ఈ ముఠా మొత్తానికి పక్కా ప్లాన్ చేసి, అమలు చేసింది ఎస్ఐ సుజన్. డబ్బుల కోసమే ఎస్ఐ సుజన్ ఈ కిడ్నాప్ కేసులో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేశాం.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు’ అని డీసీపీ తెలిపారు.

Latest News

More Articles