Sunday, April 28, 2024

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్

spot_img

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. దీంతో ప్రొఫెసర్ కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడినట్టయింది.

అయితే, గత కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా తమ పేర్లను సిఫార్సు చేయగా.. తిరస్కరించిన గవర్నర్ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పిటిషన్ విచారణ ముగిసే వరకు ఎమ్మెల్సీల నియామకాలను ఆపాలని పిటిషన్ లో కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని మంగళవారం ఆదేశించింది.

Also Read.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 52 రోజులయింది.. మరో 48 రోజుల తర్వాత మా కార్యాచరణ

Latest News

More Articles