Saturday, May 18, 2024

ఫ్లిప్‌కార్ట్ వ్యాన్ నుంచి గాల్లోకి రూ. 2 వేల నోట్లు.. వీడియో వైరల్

spot_img

ఓ సినిమాలో పోలీసులు వెంటపడటంతో.. దొంగలు కారులోని డబ్బునంతా రోడ్డు మీద చల్లుతూ వెళ్లిపోతారు. అచ్చం అటువంటి ఘటనే తాజాగా ముంబాయిలో వెలుగుచూసింది. ముంబయిలోని గేట్‌వే వీధుల నుంచి ఫ్లిప్‌కార్ట్‎కు చెందిన ఓ ట్రక్ వెళ్తోంది. అయితే ఆ వ్యాన్ స్పీడ్ బ్రేకర్ దగ్గరకు రాగానే డోర్ తెరచుకొని.. దానిలోనుంచి గాల్లోకి రూ. 2000 నోట్లు ఎగిరిపడ్డాయి. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక సినిమాలోని సీన్ లాగా, కరెన్సీ నోట్లు గాలిలో ఎగురుతూ కనిపించాయి. మొదట వాటిని చూసి ఆశ్చర్యపోయిన జనాలు.. ఆ తర్వాత వాటిని ఏరుకోవడం ప్రారంభించారు. దాంతో ఆ రోడ్డులో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది.

అయితే ఫ్లిప్‌కార్ట్ ట్రక్కులో ఇంత భారీ మొత్తంలో నగదు ఎందుకు తీసుకెళ్తున్నారు, అది ఎక్కడిది? అనే అనుమానాలు రెకెత్తుతున్నాయి. త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ ఉంది. ఈ సేల్‎ను సాకుగా చూపి.. నోట్ల మార్పిడికి తెరలేపారని భావిస్తున్నారు.

Read Also: తెలంగాణ‌లో హంగ్‌లు గింగ్‌లు రావు.. హ్యాట్రిక్‌లే వ‌స్త‌యి..

Latest News

More Articles