Friday, May 17, 2024

హెచ్‌ఎండీఏ ఆలయ భూములు అమ్మలేదు.. అవాస్తవాలు నమ్మొద్దు

spot_img

తెలంగాణ రెవెన్యూ శాఖ సర్వేనెం. 239 మరియు 240 లోని భూమి కోకాపేట్ (V), గండిపేట్ (M), రంగా రెడ్డి (D) ను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) కు అప్పగించింది. ప్రభుత్వం ఆదేశాలకు లోబడి హెచ్ఎండిఏ సర్వే నెంబర్లు 239 & 240 లలో కోకాపేట్ నియోపోలిస్ లేఅవుట్‌ను మౌలిక వసతుల కల్పనతో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసి దశలవారీగా ప్లాట్లను వేలం వేసింది. నియోపోలీస్ ఫేజ్ -II లో ప్లాట్ల వేలం కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు సర్వే నెంబర్లు 239 & 240ల సరిహద్దులో ఉన్న ఆలయాన్ని హెచ్ఎండిఏ అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు.

అంతేకాకుండా ఆలయం కోసం భూమిని గుర్తించడంతో పాటు ఆలయానికి ప్రవేశం కోసం ఆలయ భూమికి ఆనుకుని 18.0మీ వెడల్పు రహదారిని కూడా నియోపోలీస్ ఫేజ్-II వేలంప్రక్రియ సందర్భంగా ప్రతిపాదించడం జరిగింది. స్కెచ్ జతచేయబడింది, చూడవచ్చు. కోకాపేట్ నియోపోలీస్ లేఅవుట్ లో ఆలయ భూమిని హెచ్‌ఎండీఏ వేలం వేసిందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ సంస్థ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రతిష్టతను దెబ్బతీసేందుకు కొందరు వ్యక్తులు చేస్తున్న ప్రయత్నాలుగా హెచ్ఎండిఏ భావిస్తున్నది.

Latest News

More Articles